Admin Login
Language:

డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు 50 ఏళ్లకు పెంపు

June 11, 2026 Ambati Net World
[ Responsive Header Ad Slot ]
డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు 50 ఏళ్లకు పెంపు

కేంద్రం పరిశీలనలో కీలక ప్రతిపాదనలు

దేశంలో ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువు 20 ఏళ్లు ఉండగా.. దీనిని ఏకంగా 50ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం 20 ఏళ్ల గడువు ముగిసిన ప్రతి ఒక్కరూ అవసరమైన పత్రాలతో పాటు హెల్త్ సర్టిఫికేట్ సమర్పించి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాహన యాజమాన్య బదిలీ, పర్మిట్ పునరుద్ధరణ వంటి సేవలను కూడా పూర్తిగా ఆన్లైన్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక, ట్రాఫిక్ నిబంధ నలు ఉల్లంఘించే వారికి 'నెగెటివ్ పాయింట్లు' కేటాయించేలా ప్రభుత్వం గట్టి నిఘా వ్యవస్థను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ పాయింట్లు పెరిగితే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా రద్దు చేసేలా ఆన్ లైన్ వ్యవస్థను అనుసంధానిస్తారు.

[ Bottom Related Article Ad Slot ]