రాష్ట్రంలో ఈనెల 25 నుంచి ప్రారంభమయ్యే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో ఐటీ(సమాచార సాంకేతికత)ను వినియోగించుకోవాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఐటీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో బుధవారం ఐటీ వినియోగంపై జిల్లా, మండల స్థాయి మాస్టర్ ట్రైనర్లు, ఐటీ బృందం, డేటా ఆపరేటర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈవో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ‘ఎస్ఐఆర్ ప్రక్రియలో ఐటీ అంశం అత్యంత కీలకమైందని పేర్కొన్నారు.