Job Update Posted on June 11, 2026, 3:30 am

హౌసింగ్‌ కార్పొరేషన్‌లో పోస్టుల క్యాడర్ల ఖరారు

తెలంగాణ హౌసింగ్‌ కార్పొరేషన్‌లోని ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా, జోనల్, మల్టీ-జోనల్‌ పోస్టుల క్యాడర్లను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను బుధవారం జారీ చేసింది. జిల్లా క్యాడర్‌లో జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టెనో టైపిస్ట్, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌(టెక్నికల్‌), వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌(నాన్‌-టెక్నికల్‌) టెలిఫోన్‌ ఆపరేటర్, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్, బ్లూప్రింట్‌ ఆపరేటర్, అటెండర్‌/వాచ్‌మెన్‌/ స్వీపర్‌ ఉంటారు.

➡️జోనల్‌ క్యాడర్‌లో అసిస్టెంట్‌ మేనేజర్, స్పెషల్‌ గ్రేడ్‌ స్టెనో, సీనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ స్టెనో, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌) గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 పోస్టులు ఉంటాయి.

➡️మల్టీ-జోనల్‌ క్యాడర్‌లో మేనేజర్‌(ఫైనాన్స్, ఎకౌంట్స్, పరిపాలన, మేనేజ్‌మెంట్‌ సమాచార వ్యవస్థ), అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌/ అసిస్టెంట్‌ ఇంజినీరు, ఆర్కిటెక్చరల్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు ఉంటాయి.

➡️భవిష్యత్తులో మంజూరయ్యే పోస్టులతో కలిపి వీటన్నింటిని సంబంధిత జిల్లా, జోనల్, మల్టీ-జోనల్‌ పరిధులనే యూనిట్లుగా పరిగణిస్తారు. కొత్త నిబంధనల ప్రకారం స్థానిక అభ్యర్థుల ప్రాధాన్యం ఆధారంగా నియామకాలను చేపట్టాల్సి ఉంటుంది.
Share this:
Ambati Net World

Your trusted destination for the latest job updates, career opportunities, and government schemes.